నోబెల్ బహుమతి పొందిన అభిజిత్‌పై రాజద్రోహం కేసు.. ఎందుకో తెలుసా..?

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి అమెరికన్ అభిజిత్ ముఖర్జీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రాజద్రోహం కేసులో ఆయన 10 రోజులు తీహార్ జైల్లో గడిపారట.. ఈ విషయం ఆయనే స్వయంగా రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభిజిత్ 1983లో జేఎన్‌యూలో చదువుకున్నారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘ నాయకుడిని బహిష్కరించినందుకు చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరూ వైస్ ఛాన్సలర్‌ను ఘెరావ్ చేశారట. ఆ సమయంలో అధికారంలో ఉన్న […]

Advertisement
Update: 2019-10-15 01:50 GMT

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి అమెరికన్ అభిజిత్ ముఖర్జీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రాజద్రోహం కేసులో ఆయన 10 రోజులు తీహార్ జైల్లో గడిపారట.. ఈ విషయం ఆయనే స్వయంగా రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అభిజిత్ 1983లో జేఎన్‌యూలో చదువుకున్నారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘ నాయకుడిని బహిష్కరించినందుకు చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరూ వైస్ ఛాన్సలర్‌ను ఘెరావ్ చేశారట. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థులపై రాజద్రోహం కేసు నమోదు చేసి తీహార్ జైలుకు పంపింది. వారిలో అభిజీత్ ముఖర్జీ ఒకరు.

ఆయన జైలు జీవితం గురించి చెబుతూ.. ఆ పది రోజులు జైల్లో నరకం చూశానని అన్నారు. ప్రతీ రోజు కొట్టే వారని.. తమపై రాజద్రోహం కేసు మాత్రమే కాక హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారని చెప్పారు. కాగా, ఆ తర్వాత ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుందని.. అందువల్లే అమెరికాకు రాగలిగానని అన్నారు.

ఇప్పటికీ తీహార్ జైలు జీవితాన్ని తలచుకుంటే భయమేస్తుంటుందని.. కాని దాని వల్ల కూడా జీవిత పాఠం నేర్చుకున్నానని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News