మోడీ ప్రభుత్వంతో విభేదించి తప్పు చేశా... పవన్‌ కోసమే గాజువాకలో ప్రచారం చేయలేదు....

చంద్రబాబు స్వరంలో మరో యూటర్న్ ధ్వనిస్తోంది. ఇప్పుటికే సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లతో పాటు పలువురు సన్నిహిత నాయకులను బీజేపీలోకి పంపించిన చంద్రబాబు ఇప్పుడు స్వయంగా బీజేపీ సానుకూలరాగం ఆలపిస్తున్నారు. ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వంపై అనేక తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు… ఇప్పుడు అందుకు చెంపలేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి నష్టపోయామని వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు కేంద్రంతో […]

Advertisement
Update:2019-10-12 00:44 IST

చంద్రబాబు స్వరంలో మరో యూటర్న్ ధ్వనిస్తోంది. ఇప్పుటికే సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లతో పాటు పలువురు సన్నిహిత నాయకులను బీజేపీలోకి పంపించిన చంద్రబాబు ఇప్పుడు స్వయంగా బీజేపీ సానుకూలరాగం ఆలపిస్తున్నారు.

ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వంపై అనేక తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు… ఇప్పుడు అందుకు చెంపలేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి నష్టపోయామని వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు కేంద్రంతో విభేదించామని… కానీ దాని వల్ల రాష్ట్రానికి మంచి జరగలేదని… అదే సమయంలో టీడీపీకి బాగా నష్టం జరిగిందని ఆవేదన చెందారు. పరోక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఎన్నికల్లో దెబ్బతిన్నామని అభిప్రాయపడ్డారు.

కేంద్రంతో విభేదించి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. భవిష్యత్తులో ఎటువంటి తప్పు చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అప్రమత్తంగా ఉంటామని చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌తో స్నేహంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్ పట్ల హుందాగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే గాజువాకలో తాను ప్రచారానికి వెళ్లలేదని చంద్రబాబు వివరించారు.

పవన్‌ కల్యాణ్ పట్ల సానుకూలంగా ఉంటే దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా మంచి చేస్తుందని అనుకున్నానని నేతలకు వివరించారు. పవన్‌ కల్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు నిరాశ వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News