చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఫిక్స్.... అసలు కారణం ఇదే....

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచానికి చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆ చరిత్ర జరిగిన, ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుతం పాలిస్తున్న ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి రెడీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్  సీఎం జగన్ ను కలవడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్ మెంట్ కూడా ఖరారు చేసినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రాంచరణ్ భేటీకి ముహూర్తం కుదిరింది. […]

Advertisement
Update: 2019-10-10 10:20 GMT

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచానికి చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆ చరిత్ర జరిగిన, ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుతం పాలిస్తున్న ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి రెడీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్ సీఎం జగన్ ను కలవడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్ మెంట్ కూడా ఖరారు చేసినట్టు తెలిసింది.

శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రాంచరణ్ భేటీకి ముహూర్తం కుదిరింది. అయితే ఇది రాజకీయపరమైన భేటీ కాదు.. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించాల్సిందిగా చిరంజీవి.. జగన్ ను కోరనున్నారు.

ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసి తన సినిమా ‘సైరా’ను చూపించారు. ఆమె అద్భుతంగా ఉందంటూ చిరును ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఏపీ చరిత్రలో చిరస్మరణీయుడైన ఉయ్యాలవాడ చరిత్రను సీఎం జగన్ కు చూపించబోతున్నాడు చిరంజీవి.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత సినీ పెద్దలు ఎవరూ ఆయన్ను కలవలేదు. దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి. తాజాగా టాలీవుడ్ లోనే పెద్ద స్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలవడానికి రెడీ అవ్వడం విశేషం.

సైరా విడుదల సమయంలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి జగన్ ను కలవబోతున్నారని చెబుతున్నారు. దాంతో పాటు తన సినిమాను చూపించబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News