ప్రపంచ బాక్సింగ్ సెమీఫైనల్స్ లో మేరీకోమ్

పతకం ఖాయం చేసుకొన్న భారత బాక్సింగ్ క్వీన్ భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీ కోమ్…2019 ప్రపంచ బాక్సింగ్ సెమీస్ చేరడం ద్వారా…పతకం ఖాయం చేసుకొంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 51 కిలోల విభాగంలో మేరీ కోమ్ తలపడుతోంది. క్వార్టర్ ఫైనల్లో కొలంబియా బాక్సర్ వాలెన్షియాను 5-0తో చిత్తు చేయడం ద్వారా సెమీస్ చేరిన మేరీకోమ్…ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో టర్కీకి చెందిన రెండోసీడ్ బాక్సర్ బాసునాజ్ కాక్ రోగ్యులూతో తలపడనుంది. తన […]

Advertisement
Update: 2019-10-10 04:36 GMT
  • పతకం ఖాయం చేసుకొన్న భారత బాక్సింగ్ క్వీన్

భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీ కోమ్…2019 ప్రపంచ బాక్సింగ్ సెమీస్ చేరడం ద్వారా…పతకం ఖాయం చేసుకొంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 51 కిలోల విభాగంలో మేరీ కోమ్ తలపడుతోంది.

క్వార్టర్ ఫైనల్లో కొలంబియా బాక్సర్ వాలెన్షియాను 5-0తో చిత్తు చేయడం ద్వారా సెమీస్ చేరిన మేరీకోమ్…ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో టర్కీకి చెందిన రెండోసీడ్ బాక్సర్ బాసునాజ్ కాక్ రోగ్యులూతో తలపడనుంది.

తన కెరియర్ లో 9వ సారి ప్రపంచ బాక్సింగ్ బరిలోకి దిగిన మేరీకోమ్ కు ఇప్పటికే ఆరు బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ప్రస్తుత టోర్నీ సెమీస్ లో ఓడితే కాంస్యం… నెగ్గితే రజత లేదా స్వర్ణ పతకాలు సాధించే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహకంగా 51 కిలోల విభాగంలో తలపడుతున్న మేరీ కోమ్..7వసారి బంగారు పతకం నెగ్గితే అది సరికొత్త ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది. 36 ఏళ్ల వయసులో ముగ్గురు బిడ్డల తల్లిగా మేరీ కోమ్ బాక్సింగ్ బరిలోకి దిగడం విశేషం.

Tags:    
Advertisement

Similar News