ఏపీ బీజేపీ బాధ్యతలు కిరణ్ కు?

ఏపీలో బీజేపీకి కొత్త ఆశలు కనిపిస్తున్నాయట.. టీడీపీని తుత్తునియలు చేసి వచ్చే 2024 వరకూ ఏపీలో వైసీపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు కీలక నేతలకు గాలం వేసే పనిలో పడ్డారట.. ఈ క్రమంలోనే ఏపీ విభజనతో కనుమరుగైన ఉద్దండులైన కాంగ్రెస్ నేతలకు వల వేస్తోందట.. వీరితోపాటు పలువురు కీలక నేతలను చేర్చుకొని ఏపీలో బీజేపీని బలంగా తయారు చేయడానికి బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇక టీడీపీ, వైసీపీల్లో అసంతృప్తిగా ఉన్న […]

Advertisement
Update: 2019-09-30 05:48 GMT

ఏపీలో బీజేపీకి కొత్త ఆశలు కనిపిస్తున్నాయట.. టీడీపీని తుత్తునియలు చేసి వచ్చే 2024 వరకూ ఏపీలో వైసీపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు కీలక నేతలకు గాలం వేసే పనిలో పడ్డారట.. ఈ క్రమంలోనే ఏపీ విభజనతో కనుమరుగైన ఉద్దండులైన కాంగ్రెస్ నేతలకు వల వేస్తోందట.. వీరితోపాటు పలువురు కీలక నేతలను చేర్చుకొని ఏపీలో బీజేపీని బలంగా తయారు చేయడానికి బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసినట్టు తెలిసింది.

ఇక టీడీపీ, వైసీపీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపై కూడా బీజేపీ ఓ కన్నేసినట్టు చెబుతున్నారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు ఇప్పుడు టీడీపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది.

ఇక ప్రస్తుతానికి బీజేపీ కళ్లన్నీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు నాడు కాంగ్రెస్ హయాంలో వెలుగు వెలిగిన పల్లం రాజు, చింతా మోహన్ లాంటి సీనియర్లపై పడిందట.. వీరిని బీజేపీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది.

ఇక కడప జిల్లా కు చెందిన సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతానని ప్రకటించారు. బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈయనతోపాటు కడప జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో చేర్చించేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

ఇక ఏపీ బీజేపీ బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించి ఉమ్మడి ఏపీలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చించే బాధ్యతలను కిరణ్ కు అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇలా ఏపీ బీజేపీ తెరపైకి కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చే ఎత్తుగడను బీజేపీ అమలు చేస్తున్నట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News