వైసీపీ మహిళా ఎమ్మెల్యే కంటతడి... టీడీపీ నేతల కులగజ్జిపై ఆవేదన

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అవమానం జరిగింది. తుళ్లూరు మండలం అనంతవరంలో టీడీపీ స్థానిక నేతలు రెచ్చిపోయారు. వినాయకుడి మండపంలో పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను బూతులు తిట్టారు. కులం పేరుతో దూషించారు. వివిధ గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే…. అనంతవరంలోనూ ఆగి వినాయకుడికి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.కులం పేరుతో తిడుతూ…. నీవు వస్తే మండపం అపవిత్రం అవుతుందంటూ నోరుపారేసుకున్నారు. […]

Advertisement
Update: 2019-09-02 22:26 GMT

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అవమానం జరిగింది. తుళ్లూరు మండలం అనంతవరంలో టీడీపీ స్థానిక నేతలు రెచ్చిపోయారు. వినాయకుడి మండపంలో పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను బూతులు తిట్టారు. కులం పేరుతో దూషించారు. వివిధ గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే…. అనంతవరంలోనూ ఆగి వినాయకుడికి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.కులం పేరుతో తిడుతూ…. నీవు వస్తే మండపం అపవిత్రం అవుతుందంటూ నోరుపారేసుకున్నారు. కొందరు యువకులు నోటికొచ్చినట్టు పచ్చిబూతులు తిట్టారు. దాంతో అక్కడున్న మహిళలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఒక ఎమ్మెల్యేను అయిన తననే నేరుగా టీడీపీ వారు ఇలా కులం పేరుతో బూతులు తిట్టడంతో ఎమ్మెల్యే షాక్‌ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు.

తమ ఎమ్మెల్యేకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి వచ్చారు. అయితే గొడవ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు సర్దిచెప్పారు.

ఈ ఘటనపై మాట్లాడిన ఎమ్మెల్యే…ఉన్నత చదువుకున్న వ్యక్తిని తానని, ఎమ్మెల్యేగా ఉన్నానని… అలాంటి తన పట్ల ఇంతటి కులవివక్ష చూపడం బాధగా ఉందన్నారు.

ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులను టీడీపీ నేతలు బతకనిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల కులగజ్జిపై పోరాటం చేస్తానని… ఈ కులగజ్జితో పేట్రేగిపోతున్న వారిని ఎదురించి తీరుతానని ప్రకటించారు.

అనంతవరం లో టిడిపి నేతల దాస్టికం. తాడికొండ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని కులం పేరుతో దూషించిన టీడీపీ నాయకులు….

Posted by Dr Vundavalli Sridevi on Monday, 2 September 2019

అనంతవరం లో టిడిపి నేతల దాస్టికం. తాడికొండ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని కులం పేరుతో దూషించిన టీడీపీ నాయకులు….

Posted by Dr Vundavalli Sridevi on Monday, 2 September 2019

Tags:    
Advertisement

Similar News