సైరా టీజర్ కు.... పవన్ వాయిస్ ఓవర్

పుకార్లే నిజమయ్యాయి. ఊహాగానాలు కార్యరూపం దాల్చాయి. సైరాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చేశాడు. అవును.. సైరా సినిమా టీజర్ కు పవన్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న స్టిల్స్ ను కూడా రిలీజ్ చేశారు. డబ్బింగ్ రూమ్ లో పవన్ వాయిస్ ఓవర్ చెబుతుంటే.. ఓవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి, మరోవైపు చిరంజీవి నిల్చున్నారు. చిరంజీవి కొన్ని సూచనలు ఇవ్వగా, పవన్ వాయిస్ ఓవర్ […]

Advertisement
Update: 2019-08-16 10:22 GMT

పుకార్లే నిజమయ్యాయి. ఊహాగానాలు కార్యరూపం దాల్చాయి. సైరాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చేశాడు. అవును.. సైరా సినిమా టీజర్ కు పవన్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న స్టిల్స్ ను కూడా రిలీజ్ చేశారు.

డబ్బింగ్ రూమ్ లో పవన్ వాయిస్ ఓవర్ చెబుతుంటే.. ఓవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి, మరోవైపు చిరంజీవి నిల్చున్నారు. చిరంజీవి కొన్ని సూచనలు ఇవ్వగా, పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టీజర్ కు ఈ వాయిస్ ఓవర్ హైలెట్ కాబోతోంది. చరిత్ర గుర్తించని ఓ స్వతంత్ర్య యోధుడి జీవిత గాధను పవన్ వాయిస్ ఓవర్ తో ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ సురేందర్ రెడ్డి ట్వీట్ చేశాడు.

ఈనెల 20న సైరా టీజర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే మూవీకి సంబంధించి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ తో ప్రచారాన్ని మరింత పెంచబోతున్నారు. ఆ వెంటనే సింగిల్స్ కూడా రిలీజ్ అవుతాయి. నయనతార, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అనుష్క కూడా కనిపించనుంది. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News