1969లో చోరీ అయిన కిరీటం లభ్యం

దశాబ్దాల క్రితం చోరీకి గురైన అమ్మవారి కిరీటం దొరికింది. చెత్తకుప్పలో కిరీటం బయటపడింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి చెందిన ఈ కిరీటం 1969లో చోరీకి గురైంది. దాదాపు 300 గ్రాముల బరువున్న వెండి కిరీటం అది. దానిపై ఆలయం వారు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిత్తు కాగితాలు ఏరుకునే వారికి ఈ కిరీటం దొరికింది. దీన్ని గమనించిన స్థానికులు కిరీటాన్ని స్థానిక బంగారు వర్తకుల వద్దకు […]

Advertisement
Update: 2019-08-10 21:30 GMT

దశాబ్దాల క్రితం చోరీకి గురైన అమ్మవారి కిరీటం దొరికింది. చెత్తకుప్పలో కిరీటం బయటపడింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి చెందిన ఈ కిరీటం 1969లో చోరీకి గురైంది.

దాదాపు 300 గ్రాముల బరువున్న వెండి కిరీటం అది. దానిపై ఆలయం వారు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిత్తు కాగితాలు ఏరుకునే వారికి ఈ కిరీటం దొరికింది. దీన్ని గమనించిన స్థానికులు కిరీటాన్ని స్థానిక బంగారు వర్తకుల వద్దకు తీసుకెళ్లి పరీక్షించారు.

ఆ సమయంలో బంగారు వర్తకుడు ఈ కిరీటం చమళ్లమూడిలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి చెందినది అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా… అది 1969లో చోరీకి గురైన కిరీటమేనని తేలింది.

Tags:    
Advertisement

Similar News