క్విట్ కోడెల.... తమ్ముళ్ల కొత్త నినాదం !
సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు గళం విప్పారు. ఆయన నాయకత్వాన్నిఅంగీకరించేది లేదంటూ పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా కోడెలను మార్చాలని సత్తెనపల్లి టిడిపి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ ను మార్చి పార్టీని కాపాడాలని చంద్రబాబుని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా కోడెల వల్ల సొంత పార్టీ వాళ్ళం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని […]
సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు గళం విప్పారు. ఆయన నాయకత్వాన్నిఅంగీకరించేది లేదంటూ పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారు.
సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా కోడెలను మార్చాలని సత్తెనపల్లి టిడిపి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ ను మార్చి పార్టీని కాపాడాలని చంద్రబాబుని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా కోడెల వల్ల సొంత పార్టీ వాళ్ళం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.
సత్తెనపల్లిలో పార్టీ మనుగడ కోల్పోకుండా అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు నేతలు సూచించారు. కోడెలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ”క్విట్ కోడెల… సేవ్ టీడీపీ” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు 20 వాహనాల్లో రెండు వందల మందికి పైగా కోడెలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు.
అసమ్మతి వర్గానికి ముప్పాళ్ళ మాజీ యంపిపి గోగినేని కోటేశ్వరరావు టీడీపీ అధికార ప్రతినిధి గన్నమనేని శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. కోడెల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన చంద్రబాబు…. అసమ్మతి నేతలతో ఈ డ్రామా ఆడిస్తున్నారని పార్టీ ఆఫీసులో మరో వర్గం నేతల ప్రచారం కూడా నడుస్తోంది.