సుష్మాస్వ‌రాజ్ క‌న్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వ‌రాజ్ కన్నుమూశారు. తీవ్ర‌మైన గుండెపోటుతో ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ చ‌నిపోయారు. ఆమె మ‌ర‌ణ వార్త తెలియ‌గానే కేంద్ర‌మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గ‌డ్క‌రీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో పాటు బీజేపీ నేత‌లు ఎయిమ్స్‌కు వ‌చ్చారు. ఆమెకు నివాళి అర్పించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో సీనియర్ నాయకురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో […]

Advertisement
Update: 2019-08-06 20:00 GMT

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వ‌రాజ్ కన్నుమూశారు. తీవ్ర‌మైన గుండెపోటుతో ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ చ‌నిపోయారు. ఆమె మ‌ర‌ణ వార్త తెలియ‌గానే కేంద్ర‌మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గ‌డ్క‌రీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో పాటు బీజేపీ నేత‌లు ఎయిమ్స్‌కు వ‌చ్చారు. ఆమెకు నివాళి అర్పించారు.

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో సీనియర్ నాయకురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.

1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు.

1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది. ఆయన మిజోరాం గవర్నరుగా కూడా పనిచేశారు.

1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే చదివారు. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

హర్యానా రాజకీయాలు

1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు.

1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్యం మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.

జాతీయ రాజకీయాలు

1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. అంతకు ముందు 1980, 1984, 1989లలో కర్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టారు. ఆ తరువాత అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలను కూడా నిర్వహించారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబర్ లో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి గా నియమించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించినా…. ఆ తరువాతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందటంతో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు.

బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలిని నియమించడానికి సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు.

దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయినా సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

రాజ్యసభ సభ్యురాలిగా

2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టింది. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతోంది.

Tags:    
Advertisement

Similar News