జగన్‌, కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలన్న జగన్‌, కేసీఆర్‌ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి మైసూరారెడ్డి చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం మంచి పరిణామమన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 885 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలని.. ఈ మేరకు రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవాలని మైసూరారెడ్డి సూచించారు. అలా చేస్తేనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీరు దిగువకు పోకుండా రాయలసీమకు న్యాయం […]

Advertisement
Update: 2019-07-25 06:02 GMT

గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలన్న జగన్‌, కేసీఆర్‌ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి మైసూరారెడ్డి చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం మంచి పరిణామమన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 885 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలని.. ఈ మేరకు రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవాలని మైసూరారెడ్డి సూచించారు. అలా చేస్తేనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీరు దిగువకు పోకుండా రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పట్టిసీమ ప్రాజెక్ట్‌ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు.

హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని మైసూరా కోరారు.

Tags:    
Advertisement

Similar News