వన్డే ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్

సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ కు చేజారిన టైటిల్  వరుసగా రెండోసారి రన్నరప్ గా న్యూజిలాండ్ ప్రపంచానికి క్రికెట్ నేర్పిన ఇంగ్లండ్ ఎట్టకేలకు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని..క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా సాకారం చేసుకొంది. సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన టైటిల్ సమరంలో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ పై సూపర్ ఓవర్ విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో రెండుజట్లూ 241 పరుగుల చొప్పున సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో విజేతను […]

Advertisement
Update: 2019-07-14 20:25 GMT
  • సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ కు చేజారిన టైటిల్
  • వరుసగా రెండోసారి రన్నరప్ గా న్యూజిలాండ్

ప్రపంచానికి క్రికెట్ నేర్పిన ఇంగ్లండ్ ఎట్టకేలకు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని..క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా సాకారం చేసుకొంది.

సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన టైటిల్ సమరంలో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ పై సూపర్ ఓవర్ విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో రెండుజట్లూ 241 పరుగుల చొప్పున సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ విధానం పాటించారు.

సూపర్ ఓవర్ ఆరు బంతుల్లో ఇంగ్లండ్ 15 పరుగులు సాధించింది. ప్రపంచకప్ నెగ్గాలంటే సూపర్ ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ సైతం 15 పరుగులే చేసింది. అయితే న్యూజిలాండ్ కంటే ఎక్కువ బౌండ్రీలు సాధించిన ఇంగ్లండ్ ను ప్రపంచకప్ వరించింది.

గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్ ..నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యింది.
మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డును ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సొంతం చేసుకొన్నాడు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఏడువారాలపాటు సాగిన ప్రపంచకప్ టోర్నీకి కళ్లు చెదిరే ముగింపుతో తెరపడింది. వన్డే క్రికెట్లో సరికొత్త చాంపియన్ గా ఇంగ్లండ్ తెరమీదకు వచ్చింది.

Tags:    
Advertisement

Similar News