చంద్రబాబు పథకాలపై సుప్రీం కోర్టు నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పథకాలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నేరుగా నగదు బదిలీ చేసేలా తెచ్చిన పథకాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తీరా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం … పసుపు- కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో వేల కోట్లు ఓటర్లకు చేరేలా నగదు పథకాన్ని తెచ్చిందని పిటిషనర్‌ గతంలో పిటిషన్ వేశారు. ఇలా ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు బదిలీ చేయకుండా అడ్డుకోవాలని […]

Advertisement
Update: 2019-07-02 01:50 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పథకాలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నేరుగా నగదు బదిలీ చేసేలా తెచ్చిన పథకాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది.

తీరా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం … పసుపు- కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో వేల కోట్లు ఓటర్లకు చేరేలా నగదు పథకాన్ని తెచ్చిందని పిటిషనర్‌ గతంలో పిటిషన్ వేశారు.

ఇలా ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు బదిలీ చేయకుండా అడ్డుకోవాలని ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు నుంచి ఇలా నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలని పిటిషనర్‌ సుప్రీం కోర్టును కోరారు.

ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ తరపున డబ్బులు పంచుదామంటే ఐటీ దాడులు చేస్తున్నారు… అందుకే నేరుగా ప్రభుత్వ డబ్బునే పసుపు-కుంకుమ కింద ఇస్తున్నా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇలా ఎన్నికల సమయంలో నగదు బదిలీ పథకాలను అనుమతిస్తే ఎన్నికలకు అర్థమే ఉండదని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్‌ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు … కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News