రేషన్ డీలర్ల వ్యవస్థపై జగన్‌ క్లారిటీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలిలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఇకపై రేషన్ సరుకులు డోర్‌ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి నెలనెల సరుకులు సరఫరా చేస్తారు. వేలి ముద్రలు పడకపోయినా ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా రేషన్ అందచేస్తారు. ఈ కొత్త వ్యవస్థ వస్తున్న నేపథ్యంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజాపంపిణీ అంశంపై […]

Advertisement
Update: 2019-06-24 21:29 GMT

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలిలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఇకపై రేషన్ సరుకులు డోర్‌ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి నెలనెల సరుకులు సరఫరా చేస్తారు.

వేలి ముద్రలు పడకపోయినా ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా రేషన్ అందచేస్తారు. ఈ కొత్త వ్యవస్థ వస్తున్న నేపథ్యంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజాపంపిణీ అంశంపై చర్చ సందర్భంగా డీలర్లు ఉంటారా? ఉండరా? అన్న ప్రస్తావన వచ్చింది. ఇందుకు జగన్ స్పష్టత ఇచ్చారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ ఇకపై వాలంటీర్ల ద్వారా జరుగుతుంది కాబట్టి డీలర్లు ఉండరని స్పష్టం చేశారు. పెద్ద బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తిరిగి వాటిని బయట అమ్ముకుంటున్నారని… అవి తిరిగి మిల్లర్లకు చేరుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తినయోగ్యమైన సన్న బియ్యాన్నే సరఫరా చేస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News