కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై జగన్ సీరియస్‌

కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. విజయవాడ లాంటి నగరంలో ఇలాంటి పరిణామాలు మంచిది కాదన్నారు. కాల్‌ మనీ కేసుపై దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.  ఈ వ్యవహారంలో ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే వదిలిపెట్టవద్దని ఆదేశించారు. కాల్‌మనీపై ఫిర్యాదులు రాగానే తక్షణం స్పందించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అవడానికి వీల్లేదని జగన్ ఆదేశించారు. […]

Advertisement
Update: 2019-06-25 01:21 GMT
కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. విజయవాడ లాంటి నగరంలో ఇలాంటి పరిణామాలు మంచిది కాదన్నారు. కాల్‌ మనీ కేసుపై దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

ఈ వ్యవహారంలో ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే వదిలిపెట్టవద్దని ఆదేశించారు. కాల్‌మనీపై ఫిర్యాదులు రాగానే తక్షణం స్పందించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అవడానికి వీల్లేదని జగన్ ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు జగన్ సూచించారు. హైవేల పక్కన మద్యం షాపులు ఉండడానికి వీల్లేదన్నారు.

డాబాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా నిఘా ఉంచాలని… అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాలను తీసుకోవడంలో ముందుండాలన్నారు. బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నారు. అక్టోబర్ ఒకటి నాటికి ఏపీలో ఎక్కడా బెల్ట్ షాపులన్నవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు.

Tags:    
Advertisement

Similar News