జగన్‌ ప్రభుత్వాన్ని బహిష్కరించిన సినీ కుల పెద్దలు?

తెలుగు సినిమా హీరోలు కొందరు తెర మీద అనేక సందేశాలు ఇస్తుంటారు గానీ… వారికి ఒళ్లంతా కులపిచ్చి వ్యాపించి ఉంటుందన్నది చిత్రపరిశ్రమను దగ్గరగా పరిశీలించే వారి బలమైన అభిప్రాయం. గతంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ముఖ్యమంత్రిని సినీ పరిశ్రమ బృందం కలిసి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేవారు. కానీ ఈసారి ఏపీలో కొత్తగా జగన్‌ సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు చిత్రపరిశ్రమ కనీసం శుభాకాంక్షలు కూడా […]

Advertisement
Update: 2019-06-24 00:45 GMT

తెలుగు సినిమా హీరోలు కొందరు తెర మీద అనేక సందేశాలు ఇస్తుంటారు గానీ… వారికి ఒళ్లంతా కులపిచ్చి వ్యాపించి ఉంటుందన్నది చిత్రపరిశ్రమను దగ్గరగా పరిశీలించే వారి బలమైన అభిప్రాయం.

గతంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ముఖ్యమంత్రిని సినీ పరిశ్రమ బృందం కలిసి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేవారు.

కానీ ఈసారి ఏపీలో కొత్తగా జగన్‌ సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు చిత్రపరిశ్రమ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. చిత్రపరిశ్రమలోని వైసీపీ సానుభూతిపరులు మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారు గానీ… చిత్రపరిశ్రమ తరపున అధికారికంగా ఎలాంటి బృందం కలవలేదు.

ఈ అంశంపై చిత్ర పరిశ్రమలో పెద్దెత్తున చర్చ జరుగుతోంది. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల చిత్రపరిశ్రమ పెద్దలు విముఖంగా ఉండడానికి కారణం కులపిచ్చేనని చెబుతున్నారు. చిత్రపరిశ్రమను కమ్మ సామాజికవర్గం వారు దాదాపు ఆక్రమించేశారు.

హీరోల్లో 70 శాతం మంది ఆ సామాజికవర్గానికి చెందిన వారే. జగన్‌ మోహన్ రెడ్డి తమ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును ఓడించడాన్ని ఈ సినిమా వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని… అందుకే జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా వీరు సిద్ధంగా లేరని చెబుతున్నారు.

అందువల్ల జగన్‌ను కలిసి కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ సినిమా పెద్దలు సుముఖంగా లేరని కొందరు చిత్ర పరిశ్రమ వారే చెబుతున్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిలోనూ కొందరు జగన్‌కు మద్దతు ఇచ్చారు. అలాంటి వారు మినహా మిగిలిన వారంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని అనధికారికంగా బహిష్కరించారన్న భావన వ్యక్తమవుతోంది.

పైగా తాము ఉంటున్నది ఆంధ్రప్రదేశ్‌లో కాదు కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని… అందువల్ల ఏపీకి వెళ్లి సీఎంకు శుభాకాంక్షలు కూడా చెప్పాల్సిన అవసరం లేదన్న భావనతోనే చిత్రపరిశ్రమ పెద్దలున్నారు. కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రమే కాకాపడితే చాలని హైదరాబాద్‌లో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో చాలా మంది సినీ కుల పెద్దలు ఉన్నట్టు చిత్రపరిశ్రమలో చర్చ నడుస్తోంది.

అయితే చిత్రపరిశ్రమ శేయస్సు కోరే వారు మాత్రం చిత్ర పరిశ్రమ పెద్దల తీరు వల్ల పరిశ్రమకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వాన్ని బహిష్కరించడం అంటే… ఆ విషయం ఆ పార్టీకి ఓట్లేసిన వారికి అర్థమైతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

పైరసీ బూతాన్ని ఎదుర్కొవాలంటే ప్రభుత్వాల మద్దతు తప్పనిసరి అని… అలాంటి సమయంలో ఒక రాజకీయ పార్టీని రెచ్చగొడితే ఆ పార్టీ అభిమానులకు చిత్రపరిశ్రమ పట్ల వ్యతిరేక భావన ఏర్పడి అది ఎక్కడికైనా దారి తీయవచ్చని చెబుతున్నారు.

అయితే చిత్రపరిశ్రమలోని కొందరు కుల పెద్దలు మాత్రం ప్రస్తుతానికి వీటిని లెక్క చేసే స్థితిలో లేరంటున్నారు. పరిశ్రమ ప్రయోజనాల కంటే తమ కుల ఇగోను సంతృప్తి పరుచుకోవడమే ముఖ్యం అన్నట్టుగా వారి వ్యవహారం ఉందని చిత్ర పరిశ్రమలోని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News