గ్రామ కార్యదర్శులలో మహిళలకు ప్రాధాన్యం...!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ కార్యదర్శి పదవులలో సింహభాగం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని గ్రామాలలోనూ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాటికి […]

Advertisement
Update: 2019-06-21 21:39 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ కార్యదర్శి పదవులలో సింహభాగం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని గ్రామాలలోనూ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శిని నియమిస్తామని తెలిపారు.

గ్రామ సమస్యలను, ప్రభుత్వ పథకాలను ఆ కార్యదర్శుల ద్వారా నేరుగా ప్రజలకు అందజేస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కొత్తగా ఏర్పాటుచేసే గ్రామ కార్యదర్శుల పదవులలో పార్టీకి చెందిన వారు కాకుండా యువతకు ముఖ్యంగా మహిళలకు ఎక్కువ పదవులు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.

అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయాలు ఏర్పాటు అయ్యే లోపు రెండు లక్షల మందిని గ్రామ కార్యదర్శులుగా నియమించేందుకు సన్నాహాలు చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో గ్రామ కార్యదర్శులకు సంబంధించిన అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

శనివారం నాడు జరిగే ఇరిగేషన్ విభాగానికి చెందిన ఉన్నతాధికారుల సమావేశంలో పోలవరంతో సహా వివిధ నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News