ధావన్ గాయం...రిషభ్ పంత్ కు వరం

ఢిల్లీ డాషర్ కు ప్రపంచకప్ పిలుపు పంత్ కంటే రాయుడే బెటర్ అంటున్న గంభీర్ ప్రపంచకప్ లో… భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పని రెండుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసింది. ఆస్ట్రేలియాతో ముగిసిన కీలక మ్యాచ్ లో స్ట్రోక్ ఫుల్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ధావన్ ఆ తర్వాత బొటనవేలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. వేలు చితకడంతో…ధావన్ ఆటకు రెండువారాలుకుగా దూరంగా ఉండాలని వైద్యులు సలహాఇచ్చారు. శిఖర్ ధావన్ గాయం నుంచి పూర్తిగా […]

Advertisement
Update: 2019-06-12 07:24 GMT
  • ఢిల్లీ డాషర్ కు ప్రపంచకప్ పిలుపు
  • పంత్ కంటే రాయుడే బెటర్ అంటున్న గంభీర్

ప్రపంచకప్ లో… భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పని రెండుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసింది. ఆస్ట్రేలియాతో ముగిసిన కీలక మ్యాచ్ లో స్ట్రోక్ ఫుల్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ధావన్ ఆ తర్వాత బొటనవేలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. వేలు చితకడంతో…ధావన్ ఆటకు రెండువారాలుకుగా దూరంగా ఉండాలని వైద్యులు సలహాఇచ్చారు.

శిఖర్ ధావన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే రెండు నుంచి మూడువారాల వరకూ సమయం పట్టవచ్చునని…ఎప్పుడు కోలుకొంటాడో.. కచ్చితంగా చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.

దీంతో..ధావన్ కు బదులుగా స్టాండ్ బైస్ జాబితాలో ఉన్న రిషభ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

రిషభ్ పంత్ ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరాలని బీసీసీఐ ఆదేశించింది. అంతేకాదు…పంత్ కు ప్రపంచకప్ జెర్సీలతో పాటు కిట్ బ్యాగ్ ను సైతం అందుబాటులో ఉంచింది.

మరోవైపు…స్టాండ్ బై స్ జాబితాలో ఉన్న సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడుకి…శిఖర్ ధావన్ స్థానంలో అవకాశం ఇస్తే బాగుంటుందని..అది జట్టులో సమతౌల్యాన్ని పెంచుతుందని…భారత మాజీ ఓపెనర్ , లోక్ సభ సభ్యుడు గౌతం గంభీర్ అంటున్నాడు.

జట్టు కూర్పులో మార్పులు చేర్పులు..

డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో అందుబాటులో లేకపోడంతో…యువఆటగాడు రాహుల్ ను ఓపెనర్ గా దించి…రెండో డౌన్ స్థానంలో.. హార్థిక్ పాండ్యా లేదా దినేశ్ కార్తీక్ ను ఆడించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని…పలువురు ప్రపంచ మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News