మెంతులు.... చేస్తాయి ఎంతో మేలు

మనం నిత్యం తినే ఆహారంలో మెంతులు తప్పకుండా ఉండాలి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా చర్మరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు నిగనిగలాడే జుట్టుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. జట్టు కుదుళ్లను గట్టిపరచి చుండ్రును నివారిస్తాయి. పోపుల పెట్టెలో మరో దివ్యౌషధం మెంతుల గురించి తెల్సుకుందాం. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొన్ని మెంతులను మెత్తగా పొడి చేసుకుని వాటిని పల్చటి మజ్టిగతో తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి […]

Advertisement
Update: 2019-06-10 06:30 GMT

మనం నిత్యం తినే ఆహారంలో మెంతులు తప్పకుండా ఉండాలి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా చర్మరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు నిగనిగలాడే జుట్టుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. జట్టు కుదుళ్లను గట్టిపరచి చుండ్రును నివారిస్తాయి. పోపుల పెట్టెలో మరో దివ్యౌషధం మెంతుల గురించి తెల్సుకుందాం.

  • అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొన్ని మెంతులను మెత్తగా పొడి చేసుకుని వాటిని పల్చటి మజ్టిగతో తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడతారు.
  • అసిడిటీతో గుండె లేదా కడుపు మంటతో బాధపడే వారు మెంతులను పెరుగులో నానపెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • మెంతులు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధం. మెంతులు లేదా మెంతి కూర నిత్యం తీసుకుంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ అదుపులో ఉంటుంది.
  • * రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లల్లో చెంచాడు మెంతులు నానపెట్టి, ఆ నీటిని పడ గడుపునే తీసుకుంటే డయాబెటీస్, మలబద్దకం, బ్లడ్ ప్రేషర్, ఎసిడిటీ ఇంకా అనేక సమస్యలు తగ్గుతాయి.
  • * మెంతుల్లో ఉండే జిగురు తత్వం లివర్ సమస్యలకు చెక్ పెడుతుంది.
  • * డెలివరీ తర్వాత మెంతికూర లేదా మెంతులు ప్రతిరోజూ తీసుకుంటే బాలింతలకు పాలు పడతాయి.
  • * గర్భాశ్రయం శుభ్ర పడాలన్నా, రుతు సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మెంతులు లేదా మెంతి కూరను తరచూ తీసుకోవాలి.
  • * మెంతులను పేస్ట్ చేసి దానిని కాలిన గాయాలు, పుండ్లు, గజ్టి, తామర ఇతర కురుపులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • * మెంతులు లేదా మెంతికూరను పేస్ట్ లా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • * ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు, వెంట్రుకులకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు బలంగా తయారవుతాయి.
  • * మెంతికూర లేదా మెంతులలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి దానిని మొటిమలు లేదా వైట్ హెడ్స్, మచ్చలు ఉన్న చోట రాస్తే అవి క్రమేపీ తగ్గుతాయి. అంతే కాదు ముఖం కూడా ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
Tags:    
Advertisement

Similar News