ఫ్లాప్ వచ్చేసరికి, మనసు మార్చుకున్న అంజలి

అంజలి…. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో చేసిన సీత పాత్ర నే గుర్తుకు వస్తుంది. తెలుగులో అంజలి కి ఉన్న సక్సెస్ రేషియో చాలా తక్కువ. ఎందుకో ఏమో గానీ అంజలి పెద్దగా తెలుగు లో సినిమాలు చేయడానికి సుముఖత వ్యక్త పరచడం లేదు. అయితే ఇటీవలే లిసా అనే సినిమా తో అంజలి ప్రేక్షకులని భయపెట్టడానికి చాలా కాలం తర్వాత మన ముందుకు వచ్చింది. ఈ హారర్ సినిమా విడుదల అయిన తొలి […]

Advertisement
Update: 2019-06-01 00:51 GMT

అంజలి…. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో చేసిన సీత పాత్ర నే గుర్తుకు వస్తుంది. తెలుగులో అంజలి కి ఉన్న సక్సెస్ రేషియో చాలా తక్కువ. ఎందుకో ఏమో గానీ అంజలి పెద్దగా తెలుగు లో సినిమాలు చేయడానికి సుముఖత వ్యక్త పరచడం లేదు.

అయితే ఇటీవలే లిసా అనే సినిమా తో అంజలి ప్రేక్షకులని భయపెట్టడానికి చాలా కాలం తర్వాత మన ముందుకు వచ్చింది. ఈ హారర్ సినిమా విడుదల అయిన తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అంజలి ఆశలు మీద నీళ్లు చల్లినట్లు అయింది.

ఇక పోతే ప్రస్తుతం అంజలి ఈ హారర్ సినిమాలని పక్కన పెట్టి ప్రేక్షకులని మెప్పించడానికి వినోద భరిత సినిమాలు చేయాలనే దిశ గా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

చెన్నై ఫిలిం అప్డేట్స్ ప్రకారం త్వరలో ఒక తమిళ-తెలుగు చిత్రం తో మన ముందుకు రానుందట. అంతే కాకుండా తెలుగు లో తను ఇంతకు ముందు పని చేసిన దర్శకుల తో కూడా మాట్లాడుతూ తనకి అవకాశాలు ఇవ్వమని అడుగుతుంది అని సమాచారం.

Tags:    
Advertisement

Similar News