మమత సంచలనం... బీజేపీకి 100కు మించి రావట...

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాల్ లో ప్రచారం ముగిసిన నేపథ్యంలో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించారు. దేశంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ కట్ గా అంచనావేశారు. గురువారం రాత్రి 10 గంటలకు పశ్చిమ బెంగాల్ లో ప్రచారం ముగిసింది. బెంగాల్ లో విద్యాసాగర్ విగ్రహం కూల్చిన ఘటనతో బీజేపీ, తృణమూల్ మధ్య అగ్గిరాజుకుంటోంది. అందుకే అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఈసీ రెండు రోజుల ముందే ప్రచారానికి ఫుల్ […]

Advertisement
Update: 2019-05-17 07:00 GMT

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాల్ లో ప్రచారం ముగిసిన నేపథ్యంలో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించారు. దేశంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ కట్ గా అంచనావేశారు.

గురువారం రాత్రి 10 గంటలకు పశ్చిమ బెంగాల్ లో ప్రచారం ముగిసింది. బెంగాల్ లో విద్యాసాగర్ విగ్రహం కూల్చిన ఘటనతో బీజేపీ, తృణమూల్ మధ్య అగ్గిరాజుకుంటోంది.

అందుకే అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఈసీ రెండు రోజుల ముందే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

ప్రచారం ముగిసిపోవడంతో మమత బీజేపీపై ఫైర్ అయ్యింది. తనకు అందుతున్న అంచనా ప్రకారం మే 23న ఫలితాల్లో బీజేపీ చాలా తక్కువ సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. బీజేపీ నేతలు తమకు 300 సీట్లు వస్తాయని కలలుగంటున్నారని.. ఆపార్టీకి 100 సీట్లు కూడా రావని తేల్చిచెప్పారు మమతా బెనర్జీ.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ‘0’ సీట్లు అని.. తమిళనాడులో ‘0’ అని.. మహారాష్ట్రలో 20 సీట్లు మాత్రమే వస్తాయని మమత బెనర్జీ జోస్యం చెప్పింది.

ఇలా దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు తగ్గి ఆ సంఖ్య 100కు పడిపోతుందని మమతా బెనర్జీ అంచనావేశారు. మే 23 తర్వాత బీజేపీ దేశంలో ఉనికిని కోల్పోతుందని మమత స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News