ఈసీ సంచలన నిర్ణయం....

కేంద్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్నతాధికారులపై అనేక ఆరోపణలు వస్తున్ననేపథ్యంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు వేసింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా ఎల్‌ వి సుబ్రమణ్యంను నియమించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు అనిల్ చంద్ర పునేఠాను ఈసీ బదిలీ చేసింది. ఆ మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వర రావును ఈసీ బదిలీ చేయగా… […]

Advertisement
Update: 2019-04-05 11:40 GMT

కేంద్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్నతాధికారులపై అనేక ఆరోపణలు వస్తున్ననేపథ్యంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు వేసింది.

అనిల్ చంద్ర పునేఠా

ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను తప్పిస్తూ ఆదేశాలు
జారీ చేసింది. కొత్త సీఎస్‌గా ఎల్‌ వి సుబ్రమణ్యంను నియమించింది.

ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు అనిల్ చంద్ర పునేఠాను ఈసీ బదిలీ చేసింది. ఆ మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వర రావును ఈసీ బదిలీ చేయగా… ఆ బదిలీని రద్దు చేస్తూ అనిల్ చంద్ర జీవో ఇచ్చారు.

ఎల్‌ వి సుబ్రమణ్యం

దాంతో ఆగ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించుకుని అనిల్ చంద్ర పునేఠా నుంచి వివరణ తీసుకుంది. చంద్రబాబు ఆదేశాల ప్రకారం అనిల్ చంద్ర పునేఠా పనిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆయన్ను బదిలీ చేసింది.

Tags:    
Advertisement

Similar News