ఏపీ డీజీపీ ఠాకూర్‌పై ఈసీ చర్యలు

ఏపీ డీజీపీ ఠాకూర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన్ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఠాకూర్ ను ఢిల్లీ పిలిపించి వివరణ కోరారు. వివరణ ఇచ్చిన కాసేపటికే ఆయన్ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించారు. ఈసీ ఆదేశాలతో తక్షణం సీఎస్ అనిల్‌ చంద్ర జీవోను విడుదల చేశారు. ఠాకూర్ స్థానంలో ఏసీబీ చీఫ్‌గా ఎస్‌ బీ […]

Advertisement
Update: 2019-04-04 07:39 GMT

ఏపీ డీజీపీ ఠాకూర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన్ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది.

తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఠాకూర్ ను ఢిల్లీ పిలిపించి వివరణ కోరారు. వివరణ ఇచ్చిన కాసేపటికే ఆయన్ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించారు.

ఈసీ ఆదేశాలతో తక్షణం సీఎస్ అనిల్‌ చంద్ర జీవోను విడుదల చేశారు. ఠాకూర్ స్థానంలో ఏసీబీ చీఫ్‌గా ఎస్‌ బీ బాగ్చీని నియమించారు. డీజీపీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా ఏసీబీ చీఫ్‌గా ఠాకూర్‌నే చంద్రబాబు కొనసాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News