ఈ జగన్‌ ఆ జగన్‌ కాదు...

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మా ఉపాధ్యక్షురాలు హేమ వైసీపీలో చేరారు. ఆమెతోపాటు జీవిత, రాజశేఖర్ రెడ్డి దంపతులు తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల దంపతులు కూడా జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్‌తో గతంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని… కానీ వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము వైసీపీలో చేరినట్టు జీవిత దంపతులు చెప్పారు. తాను గతంలో చూసిన జగన్‌ వేరు… ఇప్పుడున్న […]

Advertisement
Update: 2019-04-01 03:52 GMT

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

తాజాగా మా ఉపాధ్యక్షురాలు హేమ వైసీపీలో చేరారు. ఆమెతోపాటు జీవిత, రాజశేఖర్ రెడ్డి దంపతులు తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల దంపతులు కూడా జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

జగన్‌తో గతంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని… కానీ వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము వైసీపీలో చేరినట్టు జీవిత దంపతులు చెప్పారు. తాను గతంలో చూసిన జగన్‌ వేరు… ఇప్పుడున్న జగన్‌ వేరని జీవిత వ్యాఖ్యానించారు. జగన్‌లో చాలా మార్పు వచ్చిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News