ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతాననే రాలేదు " పవన్ కళ్యాణ్

ఒక పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి..? ఓడిపోతామని తెల్సినా ఆ మాటలు బయటకు చెప్పకుండా నిబ్బరంగా ఉండాలి. నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే మాటలు చెప్పాలి. కాని ఇవాళ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకులే విస్తుపోయారు. ఇలా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడితే ఎలా అంటూ చర్చించుకున్నారు. అసలేం జరిగిందటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ పోటీ చేస్తే […]

Advertisement
Update: 2019-03-28 10:11 GMT

ఒక పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి..? ఓడిపోతామని తెల్సినా ఆ మాటలు బయటకు చెప్పకుండా నిబ్బరంగా ఉండాలి. నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే మాటలు చెప్పాలి. కాని ఇవాళ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకులే విస్తుపోయారు. ఇలా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడితే ఎలా అంటూ చర్చించుకున్నారు.

అసలేం జరిగిందటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ పోటీ చేస్తే నేను ఓడిపోతాను.. అందుకే వేరే నియోజక వర్గానికి మారానని అన్నారు. అనంతపురం అర్బన్‌లో సర్వే చేస్తే నాకు ఓటమే ఎదురవుతుందని ఫలితం వచ్చిందని అందుకే వరుణ్‌ను అభ్యర్థిగా నిలబెట్టానన్నారు.

అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజలు నన్ను గెలిపిస్తారనే భరోసా ఇవ్వలేదని.. వారిపై నమ్మకం లేకే వేరే నియోజక వర్గాన్ని ఎంచుకున్నానని స్పష్టం చేశారు. ఈ మాటలకు అభ్యర్థి వరుణ్ సహా మిగిలిన నాయకులు ఖంగుతిన్నారు. అధినేత నిరుత్సాహపరిచే మాటలెలా మాట్లాడతారని చర్చించుకున్నారు. పవన్ కళ్యాణే గెలవని చోట వేరే అభ్యర్థి ఎలా గెలవగలడని అనుకుంటున్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టక ముందు నుంచి అనంతపురంతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు. గతంలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. చివరకు ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News