పవన్ గారూ.... “కాపు” కాసేది లేదు సార్...?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంచనాలు తప్పుతున్నాయి. “నాకు కులాన్ని ఆపాదించకండి” అని చెప్తున్న పవన్ కళ్యాణ్… తన సామాజిక వర్గం మాత్రం తన వెంటే ఉందని ఇన్నాళ్ళూ ధీమాగా ఉన్నారు. తనను ఏ మతానికి, కులానికి పరిమితం చేయొద్దని పైకి చెబుతూనే తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోని తన సామాజిక వర్గం వారు కాపు కాస్తారు అని భావించారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలలో […]

Advertisement
Update: 2019-03-23 22:08 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంచనాలు తప్పుతున్నాయి. “నాకు కులాన్ని ఆపాదించకండి” అని చెప్తున్న పవన్ కళ్యాణ్… తన సామాజిక వర్గం మాత్రం తన వెంటే ఉందని ఇన్నాళ్ళూ ధీమాగా ఉన్నారు.

తనను ఏ మతానికి, కులానికి పరిమితం చేయొద్దని పైకి చెబుతూనే తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోని తన సామాజిక వర్గం వారు కాపు కాస్తారు అని భావించారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలలో కూడా తమ సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని…. పార్టీలోని ఇతర సామాజిక వర్గాల వారు పవన్ కళ్యాణ్ ను తప్పు పట్టారు.

వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాత్రం తనకు ఏ కులం లేదు అంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే తాజాగా మారిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఆయనకు ఎదురు తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

గడచిన పది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేస్తున్న ప్రకటనలు ఆయన సామాజిక వర్గానికి మింగుడు పడడం లేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాపు కులస్తులపై సాగించిన అణచివేతను పవన్ కళ్యాణ్ మరిచిపోయారా? అని ఆ వర్గం యువత ప్రశ్నిస్తోంది.

కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఆ సామాజికవర్గానికి చేసింది గోరంత…. చెప్పేది కొండంత అని మండిపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన రైలు ఘటనలో వందలాది మందిపై కేసులు పెట్టి ఇరికించారని, దానిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు.

అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను, ప్రకటనలను మానుకోకపోతే ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవికి పట్టిన గతే పవన్ కళ్యాణ్ కు కూడా పట్టే స్థితికి తీసుకు వస్తామని ఆయన సామాజిక వర్గానికి చెందిన యువత హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News