పదవ తరగతి పాస్ అయ్యానంటున్న పవన్

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని గాజువాక మరియు వెస్ట్ గోదావరి లోని భీమవరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో తన నామినేషన్ పేపర్లను సబ్మిట్ చేసిన పవన్ కళ్యాణ్ తాను పదవ తరగతి పాస్ అయినట్లు పేర్కొన్నారు. నామినేషన్ లో తన ఆస్తుల వివరాలను కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్. చరాస్థుల విలువ 12 కోట్లు, స్థిరాస్తుల విలువ 40.81 కోట్లుగా ఆయన […]

Advertisement
Update: 2019-03-21 23:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని గాజువాక మరియు వెస్ట్ గోదావరి లోని భీమవరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఈ నేపథ్యంలో తన నామినేషన్ పేపర్లను సబ్మిట్ చేసిన పవన్ కళ్యాణ్ తాను పదవ తరగతి పాస్ అయినట్లు పేర్కొన్నారు. నామినేషన్ లో తన ఆస్తుల వివరాలను కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్. చరాస్థుల విలువ 12 కోట్లు, స్థిరాస్తుల విలువ 40.81 కోట్లుగా ఆయన నమోదు చేశారు. పవన్ భార్యా బిడ్డల పేరు మీద ఉన్న ఆస్తుల మొత్తం విలువ 3.20 కోట్లు అని నమోదు చేసిన పవన్ అప్పులు 33.72 కోట్లు అని పేర్కొన్నారు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అప్పులలో చాలావరకు ప్రొడ్యూసర్ ల వద్ద చేసినవే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు పవన్ కు అడ్వాన్సులు ఇచ్చారు.

కానీ ఎన్నికల పైన దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిక హాసిని బ్యానర్ కు 25 లక్షలు, కొణిదెల సురేఖ కు 1.07 కోట్లు, ఎం ప్రవీణ్ కుమార్ కు మూడు కోట్లు, బాలాజీ సినీ మీడియా కు 2 కోట్లు, ఎస్వీసీసీ కి 27 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని కి 5.5 కోట్లు పవన్ కళ్యాణ్ ఇంకా ఇవ్వాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News