అన్న బాటలో తమ్ముడు పవన్..!

అన్నయ్య చిరంజీవి బాటలో తమ్ముడు పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు. ఏంటీ అన్నయ్యలా పార్టీని ఎవరి చేతిలోనైనా పెడుతున్నారా అనే డౌట్ వద్దు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యవర్గ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. “పార్టీ కార్యనిర్వాహక కమిటీ మరో గంటలో భేటీ కానుంది. నేను ఏ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయాలో నిర్ణయిస్తుందని” ఆ […]

Advertisement
Update: 2019-03-18 23:44 GMT

అన్నయ్య చిరంజీవి బాటలో తమ్ముడు పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు. ఏంటీ అన్నయ్యలా పార్టీని ఎవరి చేతిలోనైనా పెడుతున్నారా అనే డౌట్ వద్దు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యవర్గ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

“పార్టీ కార్యనిర్వాహక కమిటీ మరో గంటలో భేటీ కానుంది. నేను ఏ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయాలో నిర్ణయిస్తుందని” ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును హైదరాబాద్ నుంచి బదిలీ చేసుకొని ఏలూరులో నమోదు చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే చివరకు పలు సర్వేల ఆధారంగా భీమవరం, గాజువాక స్థానాలని ఎంచుకున్నారు.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం తరపున పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. అప్పుడు అనూహ్యంగా ఆయన తన సొంత ఊరైన పాలకొల్లు లో ఓడిపోవడం గమనార్హం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని చూస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News