నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాం " ప్రొ. కోదండరాం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని నాలుగు పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నామని తెలంగాణ జనసమితి ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మీడియాకు వెల్లడించారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరిలో పోటీ చేయాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయించగా నల్గొండ లేదా మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి పోటీ […]

Advertisement
Update: 2019-03-13 04:47 GMT

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని నాలుగు పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నామని తెలంగాణ జనసమితి ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మీడియాకు వెల్లడించారు.

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరిలో పోటీ చేయాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయించగా నల్గొండ లేదా మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీలో చర్చించాక నాలుగవ నియోజకవర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

టీజేఎస్ పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ‘ఆదివాసి హక్కుల రక్షణ’ పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నట్లు కోదండరాం చెప్పారు. భద్రాచలం నుంచి ప్రారంభమై మేడారంలో ఈ యాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News