డిపాజిట్ చేసి బీ-ఫాం తీసుకెళ్లవచ్చని +401 నెంబర్‌తో ఫోన్ వస్తే నమ్మొద్దు....

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఒక స్థానం నుంచి, విశాఖ జిల్లా లో మరో స్థానంలో ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోవైపు జనసేన టికెట్లు ఇప్పిస్తామని ఎవరైనా ఫోన్లు చేస్తే నమ్మవద్దని పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. ”జనసేన పార్టీ బి.ఫారమ్స్ సిద్ధమయ్యాయని వాటిని డిపాజిట్ చెల్లించి తీసుకోవాలి […]

Advertisement
Update: 2019-03-13 05:56 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఒక స్థానం నుంచి, విశాఖ జిల్లా లో మరో స్థానంలో ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నారు.

మరోవైపు జనసేన టికెట్లు ఇప్పిస్తామని ఎవరైనా ఫోన్లు చేస్తే నమ్మవద్దని పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది.

”జనసేన పార్టీ బి.ఫారమ్స్ సిద్ధమయ్యాయని వాటిని డిపాజిట్ చెల్లించి తీసుకోవాలి అంటూ ఫోన్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. అలాంటి నకిలీ ఫోన్ కాల్స్ (+401 లాంటి నంబర్స్ నుంచి) స్థానిక జనసేన నాయకులకు వెళ్ళాయి. అభ్యర్థుల పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతూ, డిపాజిట్ల గురించి ప్రస్తావిస్తున్నారు. జనసేన నాయకులు, శ్రేణులు… ఎవరూ ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ ను పరిగణనలోకి తీసుకోవద్దు” అని జనసేన ప్రకటన విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News