బాబుకు వర్మ ఝలక్‌... బాబు ఫొటోతో మరో పాట విడుదల

రాంగోపాల్‌ వర్మ ఎక్కడా తగ్గడం లేదు. ఆ మధ్య వెన్నుపోటు పాట విడుదల చేసిన వర్మ అందులో ఒరిజినల్‌ ఫొటోలను వాడారు. చంద్రబాబు ఫొటోలపై వెన్నుపోటు పాట ట్రాక్ ప్లే చేశారు. దాంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వర్మ తగ్గలేదు. తాజాగా మరో వీడియో సాంగ్ వదిలాడు. ”అవసరం.. అవసరం.. అవసరం… ఆస్తులన్ని పంచే వరకు తండ్రి అవసరం. వరకట్నం ఇచ్చే వరకే మామ అవసరం ” అంటూ పాట విడుదల […]

Advertisement
Update: 2019-03-06 23:26 GMT

రాంగోపాల్‌ వర్మ ఎక్కడా తగ్గడం లేదు. ఆ మధ్య వెన్నుపోటు పాట విడుదల చేసిన వర్మ అందులో ఒరిజినల్‌ ఫొటోలను వాడారు.
చంద్రబాబు ఫొటోలపై వెన్నుపోటు పాట ట్రాక్ ప్లే చేశారు. దాంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వర్మ తగ్గలేదు.

తాజాగా మరో వీడియో సాంగ్ వదిలాడు. ”అవసరం.. అవసరం.. అవసరం… ఆస్తులన్ని పంచే వరకు తండ్రి అవసరం. వరకట్నం ఇచ్చే వరకే మామ అవసరం ” అంటూ పాట విడుదల చేశారు. ఈ పాటలోనూ చంద్రబాబును ప్రధానంగా టార్గెట్‌ చేసినట్టు అర్థమవుతోంది.

”బతికి ఉండగా గుండెనెంతో బాధపెట్టినా…. పోయాక దండవేసి దండం అవసరం” అంటూ చంద్రబాబును ఉద్దేశించి పాటలో రాశారు. ”బతికి ఉండగా గుండెనెంతో బాధపెట్టినా…. పోయాక దండవేసి దండం అవసరం” అన్న వ్యాఖ్య వచ్చినప్పుడు నేరుగా చంద్రబాబు ఒరిజినల్‌ ఫొటోనే వర్మ వాడారు. ఎప్పటిలాగే ఈ పాట కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

Tags:    
Advertisement

Similar News