గవర్నర్ వద్దకు చేరిన 'డేటా చోరీ' పంచాయితీ..!

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నర్సింహ్మన్ వద్దకు చేరింది. ఏపీలోని 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడమే కాక.. ఈ డేటా ఆధారంగా అసలైన ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్వర్ రెడ్డి పిర్యాదు ఆధారంగా సైబరాబాద్ క్రైం పోలీసులు బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ సంస్థలపై దాడులు […]

Advertisement
Update: 2019-03-06 06:21 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నర్సింహ్మన్ వద్దకు చేరింది. ఏపీలోని 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడమే కాక.. ఈ డేటా ఆధారంగా అసలైన ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన లోకేశ్వర్ రెడ్డి పిర్యాదు ఆధారంగా సైబరాబాద్ క్రైం పోలీసులు బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ సంస్థలపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెలిసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. కాగా.. ఇది వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ చేసిన కుట్ర అని ఏపీ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలపై పిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఓట్ల గల్లంతు, ఐటీ గ్రిడ్ వ్యవహారం, డేటా చోరి విషయంలో గవర్నర్‌ను కలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

ఇవాళ గవర్నర్ నర్సింహ్మన్‌ను కలసి ఈ డేటా చోరీ వ్యవహారంపై పిర్యాదు చేయాలని వైసీపీ భావించింది. అందుకు గాను బుధవారం ఉదయం గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కావాలని వైసీపీ కోరింది. అయితే గవర్నర్ వేరే పర్యటనలో ఉండటంతో ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉంటారని సమాచారం ఇచ్చారు.

మరో వైపు బీజేపీ పార్టీ కూడా ఓట్ల గల్లంతు, ఏపీ ప్రజల డేటా వ్యవహారం విషయంలో మాట్లాడటానికి సమయం కావాలంటూ గవర్నర్‌ను కోరారు.

ఇలా ప్రతిపక్షం, మరో ప్రధాన పార్టీ గవర్నర్‌ను కలుస్తుండటంతో.. టీడీపీ శ్రేణుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Tags:    
Advertisement

Similar News