ఎఫ్‌-2 సినిమా పై రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు

రాఘవేంద్రరావు సినిమాలు తీయడమే తప్ప, స్టేజ్ పై పెద్దగా మాట్లాడరు. ఆయన మైక్ పట్టుకొని అనర్గలంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. దీనికి ఓ కారణం ఉంది. ఆయనకు స్టేజ్ పై సరిగ్గా మాట్లాడ్డం రాదంటారు చాలామంది. పైగా బూతులు లేకుండా ఆయన అస్సలు మాట్లాడలేరట. అందుకే ప్రసంగాలకు దర్శకేంద్రుడు దూరంగా ఉంటారనేది ఓ టాక్. దీనికి మరింత ఊతమిచ్చేలా వ్యవహరించాడు ఈ సీనియర్ దర్శకుడు. ఎఫ్2 సినిమా 50 రోజుల వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన […]

Advertisement
Update: 2019-03-04 01:47 GMT

రాఘవేంద్రరావు సినిమాలు తీయడమే తప్ప, స్టేజ్ పై పెద్దగా మాట్లాడరు. ఆయన మైక్ పట్టుకొని అనర్గలంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. దీనికి ఓ కారణం ఉంది. ఆయనకు స్టేజ్ పై సరిగ్గా మాట్లాడ్డం రాదంటారు చాలామంది. పైగా బూతులు లేకుండా ఆయన అస్సలు మాట్లాడలేరట. అందుకే ప్రసంగాలకు దర్శకేంద్రుడు దూరంగా ఉంటారనేది ఓ టాక్. దీనికి మరింత ఊతమిచ్చేలా వ్యవహరించాడు ఈ సీనియర్ దర్శకుడు.

ఎఫ్2 సినిమా 50 రోజుల వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు…. ఆ సినిమాను మెచ్చుకునే క్రమంలో కాస్త అభ్యంతరకరంగా మాట్లాడారు. హీరోయిన్లను ఎప్పుడూ ఎమోషనల్ యాంగిల్ లోనే చూపించకూడదని, కాస్త అందంగా చూపించాలన్న రాఘవేంద్రరావు.. హీరోయిన్ లు ఇద్దరూ బికినీలు వేయడమే ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటూ కామెంట్స్ చేశారు.

తమన్న, మెహ్రీన్ ఇద్దరూ బికినీల్లో అద్భుతంగా ఉన్నారంటూ రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వయసుకు తగ్గట్టు దర్శకేంద్రుడు మాట్లాడితే బాగుంటుందని అతడికి సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.

కేవలం ఈ విషయంలోనే కాదు, గతంలో తను నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా ఇలా హద్దులు దాటి మాట్లాడారు రాఘవేంద్రరావు. కొన్ని డైలాగ్స్ ను ఎడిటింగ్ లో కత్తిరిస్తే, మరికొన్ని యథాతథంగా ప్రసారమయ్యేవి.

Tags:    
Advertisement

Similar News