టీడీపీకి రఘురామకృష్టంరాజు రాజీనామా

టీడీపీలో మరో కీలక వికెట్ పడింది. నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రఘురామకృష్టంరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వైఎస్‌ జగన్‌ను రఘురామకృష్ణంరాజు కలవనున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ ఖాయమని చెబుతున్నారు. గతంలోనే ఆయన ఒకసారి వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన […]

Advertisement
Update: 2019-03-02 11:55 GMT

టీడీపీలో మరో కీలక వికెట్ పడింది. నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రఘురామకృష్టంరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కొన్ని నెలల క్రితమే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వైఎస్‌ జగన్‌ను రఘురామకృష్ణంరాజు కలవనున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ ఖాయమని చెబుతున్నారు.

గతంలోనే ఆయన ఒకసారి వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రఘురామకృష్టంరాజు తిరిగి వైసీపీ గూటికే చేరుతున్నారు. రఘురామకృష్టంరాజు కేవీపీ రామచంద్రరావుకు స్వయాన వియ్యంకుడు.

Tags:    
Advertisement

Similar News