బడ్జెట్‌లో రైతులకు భారీ పథకాన్ని ప్రకటించిన మోడీ ప్రభుత్వం

ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు వరాల జల్లు కురిపించింది. రైతులకు భారీ పథకం ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయబోతున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఈ సొమ్మును కేంద్రప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలోకే వేస్తారు. రెండు వేల చొప్పున మూడు […]

Advertisement
Update: 2019-02-01 01:34 GMT

ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు వరాల జల్లు కురిపించింది. రైతులకు భారీ పథకం ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయబోతున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

ఈ సొమ్మును కేంద్రప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలోకే వేస్తారు. రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో ఈసొమ్ము జమ చేస్తారు. ఈ పథకం ద్వారా పేదలైన 12 కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుందని మంత్రి ప్రకటించారు. 2018 డిసెంబర్‌ నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం తన బడ్జెట్‌లో ప్రకటించింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూ. 75వేల కోట్లు ఖర్చు అవుతుంది.

Tags:    
Advertisement

Similar News