ఉండవల్లి సమావేశంలో నేతల భిన్నాభిప్రాయాలు....

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అస్పష్టంగానే ముగిసింది. సమావేశానికి వివిధ పార్టీల నుంచి హాజరైన వారు భిన్నవాదనలు వినిపించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై ఒకరి వాదనను మరొకరు తప్పుపట్టారు. దాంతో పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకుండానే సమావేశం ముగిసింది. కేంద్రం చేసిన సాయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా లెక్కలు చూపారు. టీడీపీ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేయగా…. ఐవైఆర్ వ్యతిరేకించారు. కేంద్రం వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా వాదన చేయడం సరికాదన్నారు. కేంద్ర […]

Advertisement
Update: 2019-01-29 08:51 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అస్పష్టంగానే ముగిసింది. సమావేశానికి వివిధ పార్టీల నుంచి హాజరైన వారు భిన్నవాదనలు వినిపించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై ఒకరి వాదనను మరొకరు తప్పుపట్టారు. దాంతో పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకుండానే సమావేశం ముగిసింది.

కేంద్రం చేసిన సాయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా లెక్కలు చూపారు. టీడీపీ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేయగా…. ఐవైఆర్ వ్యతిరేకించారు. కేంద్రం వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా వాదన చేయడం సరికాదన్నారు. కేంద్ర వివరణ తీసుకోకుండానే రాష్ట్రానికి ఎంతివ్వాలన్నది ఏకపక్షంగా తేల్చలేమన్నారు.

సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలోలాగే అసలు విభజన చట్టానికే చట్టబద్దత లేదని…. ఆ అంశంపై చర్చించాలని హాజరైన వారిని కోరారు.

కానీ నేతలు మాత్రం విభజన చట్టంలోని హామీలపైనే చర్చ జరగాలని సూచించారు. ఇలా చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.

దీంతో ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలంటూ సమావేశంలో తీర్మానం చేసి ముగించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి వైసీపీ, సీపీఎం హాజరు కాలేదు.

Tags:    
Advertisement

Similar News