యూపీలో కూలిన భారత వైమానిక దళ విమానం

భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ ఇవాళ యూపీలో కూలిపోయింది. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఈ ఫైటర్ జెట్ లక్నోకు 322 కిలోమీటర్ల దూరంలోని కుషీనగర్ ప్రాంతంలో కూలినట్లు వైమానిక దళం ప్రకటించింది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బయలుదేరిన ఈ విమానం కూలిపోయినా.. పైలెట్లు ఎజెక్టర్ల ద్వారా తప్పించుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై వైమానిక దళం న్యాయ విచారణకు ఆదేశించింది. జాగ్వర్ జెట్ కూలిపోవడానికి గల […]

Advertisement
Update: 2019-01-28 02:40 GMT

భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ ఇవాళ యూపీలో కూలిపోయింది. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఈ ఫైటర్ జెట్ లక్నోకు 322 కిలోమీటర్ల దూరంలోని కుషీనగర్ ప్రాంతంలో కూలినట్లు వైమానిక దళం ప్రకటించింది.

రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బయలుదేరిన ఈ విమానం కూలిపోయినా.. పైలెట్లు ఎజెక్టర్ల ద్వారా తప్పించుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

ఈ ఘటనపై వైమానిక దళం న్యాయ విచారణకు ఆదేశించింది. జాగ్వర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలు ఈ విచారణలో తెలిసే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News