ఈమె వయసు 36.... శబరిమల గుడిలోకి దర్జాగా ఎలా వెళ్లిందంటే....

కేరళలో శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళ ప్రవేశ అంశం పెను వివాదాన్ని సృష్టిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు దగ్గరుండి మరీ మహిళలను స్వామి వద్దకు తీసుకెళ్తుండడంతో…. కేరళ ప్రభుత్వం పైనా తీవ్రస్థాయిలో అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. తాజాగా మరో మహిళ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తీరు సంచలనంగా మారింది. ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె అనుసరించిన విధానంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. 36 ఏళ్ల మంజు అనే మహిళ దర్జాగా ఆలయంలోకి వెళ్లింది. ఆ […]

Advertisement
Update: 2019-01-09 23:37 GMT

కేరళలో శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళ ప్రవేశ అంశం పెను వివాదాన్ని సృష్టిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు దగ్గరుండి మరీ మహిళలను స్వామి వద్దకు తీసుకెళ్తుండడంతో…. కేరళ ప్రభుత్వం పైనా తీవ్రస్థాయిలో అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

తాజాగా మరో మహిళ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తీరు సంచలనంగా మారింది. ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె అనుసరించిన విధానంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. 36 ఏళ్ల మంజు అనే మహిళ దర్జాగా ఆలయంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆ విషయాన్ని బయటకు వచ్చి ప్రకటించుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఆలయంలోనే ఉన్నానని వివరించింది.

స్వామి దర్శనం కూడా అయిందని…. ఆ సమయంలో తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. ఇలా ఆమె ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆలయంలోకి వెళ్లేందుకు కొత్త పంథాను అనుసరించింది. 36 ఏళ్ల మంజు తన నల్లటి వెంట్రుకలకు తెల్లటి డై వేసుకుని… వయసులో చాలా పెద్ద మనిషిగా కనిపించేలా జాగ్రత్తపడింది.

ఆమె వెంట్రుకలు తెల్లగా ఉండడంతో మిగిలిన భక్తులు కూడా ఆమెను యుక్త వయస్కురాలిగా గుర్తించలేకపోయారు. దీంతో ఆమె నేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చారు. వెంట్రుకలకు రంగు వేసుకోవడం వల్ల తనను ఎవరూ గుర్తు పట్టలేదని వ్యాఖ్యానించారామె.

ఫొటోను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ముందు వరకు అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉండేది. వెంట్రుకలకు తెల్లటి రంగేసుకుని ఆలయంలోకి వెళ్లిన మంజు… వామపక్ష అనుబంధ సంస్థ కార్యకర్తగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News