నెరవేరిన కర్నూలు ప్రజల కల.... విజయవంతంగా చేరిన విమానం

కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. సోమవారం ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా పూర్తయింది. ట్రయల్ రన్‌లో భాగంగా శంషాబాద్‌ నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టు కు తొలి విమానం వచ్చింది. విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ నేతృత్వంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు. 2017 జూన్‌ 21న ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగింది. రికార్డు సమయంలో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చారు. దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ గ్రీన్‌ […]

Advertisement
Update: 2018-12-31 01:59 GMT

కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. సోమవారం ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా పూర్తయింది.

ట్రయల్ రన్‌లో భాగంగా శంషాబాద్‌ నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టు కు తొలి విమానం వచ్చింది. విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ నేతృత్వంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు.

2017 జూన్‌ 21న ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగింది. రికార్డు సమయంలో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చారు. దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చారు.

కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు సమీపాన విమానాశ్రయం నిర్మించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో జనవరి ఏడున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు.

Tags:    
Advertisement

Similar News