పది పాసవలేదు... పైలట్లు అయ్యారు!

పదో తరగతి పాసవకుండా…ఏకంగా విమానాలే నడుపుతున్నారు కొందరు పాకిస్థాన్ పైలట్లు. పాక్ ప్రభుత్వానికి చెందిన ఏయిర్ లైన్స్ లో దాదాపు 50 మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం చేస్తూ… పైలెట్లుగా చెలామణి అవుతున్నారు. ఇందులో ఏడుగురు ఫైలట్ల వివరాలు బోగస్ అని దాఖలైన పిటిషన్ పై పాక్ సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా పాక్ ఏవియేషన్ అధికారులు…ఫేక్ పైలట్ల వివరాలను కోర్టుకు అందించారు. పదోతరగతి పాస్ కాని వాళ్లు బస్ నడపడానికి కూడా అర్హులు కారు. […]

Advertisement
Update: 2018-12-31 00:14 GMT

పదో తరగతి పాసవకుండా…ఏకంగా విమానాలే నడుపుతున్నారు కొందరు పాకిస్థాన్ పైలట్లు. పాక్ ప్రభుత్వానికి చెందిన ఏయిర్ లైన్స్ లో దాదాపు 50 మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం చేస్తూ… పైలెట్లుగా చెలామణి అవుతున్నారు. ఇందులో ఏడుగురు ఫైలట్ల వివరాలు బోగస్ అని దాఖలైన పిటిషన్ పై పాక్ సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.

ఇందులో భాగంగా పాక్ ఏవియేషన్ అధికారులు…ఫేక్ పైలట్ల వివరాలను కోర్టుకు అందించారు. పదోతరగతి పాస్ కాని వాళ్లు బస్ నడపడానికి కూడా అర్హులు కారు. కానీ అలాంటి వీళ్లు విమానాలు నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ కేసును విచారిస్తున్న జస్టిస్ ఇజాజుల్ ఎహసాన్ అనడం గమనార్హం.

సరైన పత్రాలను సమర్పించని కారణంగా ఇప్పటివరకు 50 మంది పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సిబ్బందిని తొలగించినట్లు ఆ సంస్థ కోర్టుకు తెలిపింది.

వీళ్లలో ఏడుగురు ఇచ్చిన పత్రాలు నకిలీవి కాగా.. ఐదుగురు కనీసం పది కూడా పాసవలేదని తేలింది. పైలట్ల డిగ్రీ వెరిఫికేషన్ ప్రక్రియకు కాలేజీలు, యూనివర్సిటీలు తమకు సహకరించడం లేదని ఎయిర్‌లైన్స్ అధికారులు కోర్టుకు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News