చరిత్ర సృష్టించిన ఇండియా... మట్టి కరిచిన ఆసీస్

టీమిండియా చరిత్ర సృష్టించింది. మెల్బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఆసీస్‌ను సొంత గడ్డపైనే చిత్తు చేసి సత్తా చాటింది. బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌ చేతిలో ఆస్ట్రేలియా తొలి ఓటమిని చవిచూసింది. 399 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆటగాళ్లు భారత్‌ బౌలర్లు విసిరిన బంతుల ధాటికి విలవిలలాడిపోయారు. 258 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌… కేవలం మూడు పరుగుల్లోనే […]

Advertisement
Update: 2018-12-29 21:51 GMT

టీమిండియా చరిత్ర సృష్టించింది. మెల్బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఆసీస్‌ను సొంత గడ్డపైనే చిత్తు చేసి సత్తా చాటింది.

బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌ చేతిలో ఆస్ట్రేలియా తొలి ఓటమిని చవిచూసింది. 399 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆటగాళ్లు భారత్‌ బౌలర్లు విసిరిన బంతుల ధాటికి విలవిలలాడిపోయారు.

258 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌… కేవలం మూడు పరుగుల్లోనే మిగిలిన రెండు వికెట్లను భారత్‌ బౌలర్లకు సమర్పించుకుంది. 137 పరుగుల భారీ విజయం భారత్‌ సొంతమైంది. దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్లో భారత్‌ 2-1 ఆధిక్యం సాధించింది.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో భారత్‌ 8 బాక్సింగ్ డే టెస్టులు ఆడింది. కానీ తొలిసారి ఇప్పుడు విజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదు సార్లు ఆసీస్ గెలవగా… రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. చివరి టెస్ట్‌ జనవరి 3నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధిస్తే సిరీస్ భారత్‌ వశం కానుంది.

Tags:    
Advertisement

Similar News