ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన అనితకు సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన తప్పలేదు. పాల్తేరులో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే అనిత సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. ఇటీవల పాయకరావుపేట టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పాత నేతలంతా ఒకవైపు ఉండగా… అనిత వర్గం మరో వైపు ఉంటోంది. పాత నేతలకు ఎమ్మెల్యే అనిత ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారన్నది ఒక […]

Advertisement
Update: 2018-12-25 03:16 GMT

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన అనితకు సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన తప్పలేదు. పాల్తేరులో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే అనిత సమక్షంలోనే ఈ గొడవ జరిగింది.

ఇటీవల పాయకరావుపేట టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పాత నేతలంతా ఒకవైపు ఉండగా… అనిత వర్గం మరో వైపు ఉంటోంది. పాత నేతలకు ఎమ్మెల్యే అనిత ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారన్నది ఒక వర్గం ఆరోపణ.

ఈ నేపథ్యంలో అనిత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రకు టీడీపీలోని ఒకవర్గం స్థానిక నేతలను అనిత ఆహ్వానించలేదు. దీంతో పాల్తేరులో పాత నేతలు అనితను అడ్డుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులైన తమను ఎందుకు పాదయాత్రకు ఆహ్వానించలేదని నిలదీశారు.

ఈ సమయంలో మాటమాట పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయి టీడీపీ నేతలు కొట్టుకున్నారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే అనితను అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Tags:    
Advertisement

Similar News