"లై" సినిమా నా వల్లే ఫ్లాప్ అయింది

ప్రేమ కథలతో సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడిగా హను రాఘవపూడి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “పడి పడి లేచే మనసు”. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హను రాఘవపూడి మాట్లాడుతూ “లై” సినిమా తన వల్లే ఫ్లాప్ అయింది అని చెప్పుకొచ్చాడు. “లై” సినిమా ఫ్లాప్ అయ్యాక నితిన్ మీడియా తో… అసలు ప్రేక్షకులకి సినిమా చూడటం రాదూ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ హను రాఘవపూడి మాత్రం […]

Advertisement
Update: 2018-12-21 00:38 GMT

ప్రేమ కథలతో సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడిగా హను రాఘవపూడి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “పడి పడి లేచే మనసు”. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హను రాఘవపూడి మాట్లాడుతూ “లై” సినిమా తన వల్లే ఫ్లాప్ అయింది అని చెప్పుకొచ్చాడు.

“లై” సినిమా ఫ్లాప్ అయ్యాక నితిన్ మీడియా తో… అసలు ప్రేక్షకులకి సినిమా చూడటం రాదూ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ హను రాఘవపూడి మాత్రం తన తప్పు వల్లే “లై” ఫ్లాప్ అయింది అంటున్నాడు.

“లై అంటే ఇప్ప‌టికీ నాకు ఇష్ట‌మే. స్క్రిప్ట్ ప‌రంగా బాగానే రాసుకున్నాను…. కానీ ఆ సినిమాని తొంద‌ర‌గా తీయాల్సివ‌చ్చింది. ఆ కంగారులో రాసుకున్న సినిమాని తెర‌పై చూపించ‌లేక‌పోయాను. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది” అని చెప్పుకొచ్చాడు హను రాఘవపూడి.

ఇక మీదట మాత్రం ప్రేక్షకుల ఆలోచనలకి దగ్గరగా ఉండేలా సినిమాలు చేస్తాను అని హను రాఘవపూడి మీడియాతో అన్నాడు.

Tags:    
Advertisement

Similar News