భగత్‌ సింగ్‌పై నోరు జారిన పవన్‌ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ నోరు జారారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్‌… డల్లాస్‌లో ప్రవాస గర్జన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడిన పవన్ కల్యాణ్…. ఒక సందర్భంలో భగత్‌ సింగ్‌ను కీర్తించారు. భగత్‌ సింగ్ గురించి చెబుతూ 23 ఏళ్ల వయసులో భగత్‌ సింగ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరుడైన భగత్‌ సింగ్‌ను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పవన్ చెప్పడంపై […]

Advertisement
Update: 2018-12-17 02:04 GMT

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ నోరు జారారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్‌… డల్లాస్‌లో ప్రవాస గర్జన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడిన పవన్ కల్యాణ్…. ఒక సందర్భంలో భగత్‌ సింగ్‌ను కీర్తించారు.

భగత్‌ సింగ్ గురించి చెబుతూ 23 ఏళ్ల వయసులో భగత్‌ సింగ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరుడైన భగత్‌ సింగ్‌ను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పవన్ చెప్పడంపై కంగుతింటున్నారు. సోషల్ మీడియాలో పవన్‌ వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి.

23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో బ్రిటిష్‌ వాళ్లు ఉరితీశారు. ఇలాంటి విషయాలు కూడా తెలియకుండా పవన్‌ కళ్యాణ్‌ పదే పదే భగత్‌ సింగ్‌ గురించి, చేగువేరా గురించి ఎందుకు మాట్లాడుతాడని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News