రఫెల్ డీల్‌... సుప్రీంలో మోడీకి ఊరట

రఫెల్‌ డీల్‌ కేసులో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రఫెల్ డీల్‌పై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశ రక్షణకు సంబంధించిన రఫెల్‌ డీల్‌లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరిచింది. ఫ్రాన్స్ నుంచి కేంద్రం కొనుగోలు చేసిన 126 రఫెల్ జెట్‌ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై దర్యాప్తుకు […]

Advertisement
Update: 2018-12-13 23:49 GMT

రఫెల్‌ డీల్‌ కేసులో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రఫెల్ డీల్‌పై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

దేశ రక్షణకు సంబంధించిన రఫెల్‌ డీల్‌లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరిచింది.

ఫ్రాన్స్ నుంచి కేంద్రం కొనుగోలు చేసిన 126 రఫెల్ జెట్‌ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై దర్యాప్తుకు ఆదేశించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌ను విచారించిన కోర్టు రఫెల్ జెట్ ధరల అంశాన్ని నిపుణుల కమిటీ చూసుకుంటుందని…. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

దేశ రక్షణతో ముడిపడి ఉన్నందున రఫెల్‌ ధరలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దేశ రక్షణ దృష్ట్యా రఫెల్‌ డీల్‌ను రహస్యంగానే ఉంచాలని ఆదేశించింది.

రఫెల్‌ డీల్‌లో అనుమానించాల్సిన అంశాలేమీ లేవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశ రక్షణకు సంబంధించిన ఈ అంశంపై చర్చ కూడా అనవసరం అని అభిప్రాయపడింది. రఫెల్ డీల్‌పై మొత్తం 36 పిటిషన్లు దాఖలవగా వాటన్నింటిని సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News