రాధా వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడటం ఖాయమేనా?

గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్నాడు వంగవీటి రాధా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ విభాగంలో కొన్నాళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అక్కడ పంచాయితీ సాగింది. అక్కడ నుంచి మల్లాది విష్ణును అభ్యర్థిగా ప్రకటించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా అసహనభరితుడు అయ్యాడు. అయితే వంగవీటికి జగన్ వేరే ఆప్షన్ […]

Advertisement
Update: 2018-12-08 03:07 GMT

గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్నాడు వంగవీటి రాధా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ విభాగంలో కొన్నాళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అక్కడ పంచాయితీ సాగింది. అక్కడ నుంచి మల్లాది విష్ణును అభ్యర్థిగా ప్రకటించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

దీంతో ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా అసహనభరితుడు అయ్యాడు.

అయితే వంగవీటికి జగన్ వేరే ఆప్షన్ ఇచ్చాడని.. విజయవాడ ఈస్ట్‌ గానీ, బందరు నుంచి ఎంపీగా గానీ పోటీ చేయమని చెబుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అది వంగవీటికి ఇష్టం లేదని…. ఆయన వైసీపీని వీడతాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే వంగవీటి మాత్రం అప్పుడు రాజీనామా చేయలేదు.

అలాగని పార్టీలో యాక్టివ్ గా కనిపించడమూ లేదు. కామ్ గా ఉంటూ వస్తున్నాడు.

అదును చూపి వంగవీటి రాధా స్పందించవచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఆ సమయం వచ్చేసిందనే టాక్ వినిపిస్తోందిప్పుడు. త్వరలోనే తన తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా రాధా కీలక ప్రకటన చేస్తాడని…. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రకటనను ఆ రోజు చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈయన జనసేనలోకి చేరవచ్చని అంటున్నారు. జనసేనలో విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో రాధాకు హామీ లభించిందని…. దీంతో ఈయన అటు వైపు వెళ్తాడని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. అలాగని ఖండించనూ లేదు.

Tags:    
Advertisement

Similar News