రంగంలోకి లగడపాటి... ఆ ఎంపీ టికెట్‌ కోసం...!

తెలంగాణ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌. అవకాశం వస్తే తెలంగాణ నుంచి ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలని తాను భావిస్తున్నానని ఇటీవలే లగడపాటి స్వయంగా ప్రకటించారు. అదే సమయంలో ఇటీవల లగడపాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు కూడా కూటమికి అనుకూలంగా ఉంటాయని లగడపాటి భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో మహాకూటమికి […]

Advertisement
Update: 2018-12-01 22:56 GMT

తెలంగాణ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌. అవకాశం వస్తే తెలంగాణ నుంచి ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలని తాను భావిస్తున్నానని ఇటీవలే లగడపాటి స్వయంగా ప్రకటించారు.

అదే సమయంలో ఇటీవల లగడపాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు కూడా కూటమికి అనుకూలంగా ఉంటాయని లగడపాటి భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో మహాకూటమికి అనుకూలంగా తన వంతుగా సర్వే అంటూ మాట సాయం చేసేందుకు లగడపాటి సిద్ధపడ్డారని చెబుతున్నారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే ఎలాగో చంద్రబాబు ఆశీస్సులు ఉన్నందున… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి గానీ, ఖమ్మం నుంచి గానీ లగడపాటి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ ఆలోచనతోనే తెలంగాణ మహాకూటమి బలపడుతోందన్న వాతావరణం సృష్టించేందుకు రచించిన మైండ్‌ గేమ్‌లో లగడపాటి కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News