సమంతా సినిమాలో నాగ శౌర్య

అక్కినేని సమంతా “యు టర్న్” సినిమా తరువాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఓకే చేసింది. కొరియన్ సినిమా అయిన “మిస్ గ్రాని” సినిమా కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. గతలో “అలా మొదలైంది” “జబర్దస్త్” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి ఈ రీమేక్ సినిమాని డైరెక్ట్ చేయబోతుంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాలో నాగ శౌర్య ఒక ముఖ్య […]

Advertisement
Update: 2018-12-01 00:36 GMT

అక్కినేని సమంతా “యు టర్న్” సినిమా తరువాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఓకే చేసింది. కొరియన్ సినిమా అయిన “మిస్ గ్రాని” సినిమా కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. గతలో “అలా మొదలైంది” “జబర్దస్త్” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి ఈ రీమేక్ సినిమాని డైరెక్ట్ చేయబోతుంది.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాలో నాగ శౌర్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అని తెలుస్తోంది. “నర్తనశాల” ఫ్లాప్ అయిన తరువాత నాగ శౌర్య కి ఇదొక మంచి అవకాశం అని చేపోచ్చు. ఈ సినిమాలో సమంత ఒక డెబ్బై ఏళ్ళ ముసలావిడ పాత్రలో నటిస్తుంది. ఈ ముసలావిడ ఆత్మ ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి శరీరం లోకి వెళ్తే….. ఏంటి అనేది ఈ సినిమా కథ. గురు ఫిలిం పై సునీత తాటి అలాగే సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News