"ఆర్.ఆర్.ఆర్" సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి

ప్రియమణి… కొన్నేళ్ళ ముందు వరకు ఈ హీరోయిన్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉండేది. కానీ క్రమంగా ఫ్లాప్స్ రావడంతో ప్రియమణి తెలుగు లో సినిమాలు మానేసి వేరే బాషలో సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక ఇతర బాషల్లో కూడా సినిమాలు మానేసిన ప్రియమణి పెళ్ళి చేసుకొని హాయిగా టీవి షోస్ చేస్తూ కాలాన్ని గడిపేస్తుంది. కానీ తాజా సమాచారం మేరకు ప్రియమణి “ఆర్.ఆర్.ఆర్” సినిమాతో మళ్ళీ తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తోందట. ఈ […]

Advertisement
Update: 2018-11-30 01:39 GMT

ప్రియమణి… కొన్నేళ్ళ ముందు వరకు ఈ హీరోయిన్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉండేది. కానీ క్రమంగా ఫ్లాప్స్ రావడంతో ప్రియమణి తెలుగు లో సినిమాలు మానేసి వేరే బాషలో సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇక ఇతర బాషల్లో కూడా సినిమాలు మానేసిన ప్రియమణి పెళ్ళి చేసుకొని హాయిగా టీవి షోస్ చేస్తూ కాలాన్ని గడిపేస్తుంది. కానీ తాజా సమాచారం మేరకు ప్రియమణి “ఆర్.ఆర్.ఆర్” సినిమాతో మళ్ళీ తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తోందట. ఈ సినిమాలో ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రియమణి “యమదొంగ” చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక కూడా ఇంకా జరగాల్సి ఉంది.

దీంతో పాటు విలన్ పాత్ర చేసేది ఎవరు? అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నాడు రాజమౌళి.

Tags:    
Advertisement

Similar News