నా ప్రియుడు మీకు దొరకడు

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. పెళ్లిపై అడిగిన ప్రశ్నకు స్పందిన ఈ బ్యూటీ, తన ప్రియుడ్ని వెదకాలని ప్రయత్నిస్తే, అతడు ఎక్కడా దొరకడని అంటోంది. అంటే దానర్థం, తనకు అస్సలు బాయ్ ఫ్రెండ్ లేడని చెబుతోంది. “నా ప్రియుడు హైదరాబాద్ లో ఉన్నారని కొందరంటున్నారు. లేదు, ముంబయిలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. మీరు ఈ రెండు నగరాల్లో ఎక్కడ వెదికినా నా ప్రియుడు మీకు కనిపించడు. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ […]

Advertisement
Update: 2018-11-24 05:11 GMT

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. పెళ్లిపై అడిగిన ప్రశ్నకు స్పందిన ఈ బ్యూటీ, తన ప్రియుడ్ని వెదకాలని ప్రయత్నిస్తే, అతడు ఎక్కడా దొరకడని అంటోంది. అంటే దానర్థం, తనకు అస్సలు బాయ్ ఫ్రెండ్ లేడని చెబుతోంది.

“నా ప్రియుడు హైదరాబాద్ లో ఉన్నారని కొందరంటున్నారు. లేదు, ముంబయిలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. మీరు ఈ రెండు నగరాల్లో ఎక్కడ వెదికినా నా ప్రియుడు మీకు కనిపించడు. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు.”

ఇలా తన వ్యక్తిగత జీవితంపై స్పందించిన రకుల్.. పెళ్లిపై కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. పెళ్లి చేసుకోమని ఇంట్లో అమ్మ ఒకటే పోరు పెడుతోందని, అది ఎప్పుడనే విషయం అమ్మ చేతిలోనే ఉందని చెబుతోంది. తనకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమంటున్న రకుల్.. మరోవైపు అమ్మ చూసిన సంబంధం కూడా ఇష్టమే అంటోంది. ఇలా పెళ్లి, ప్రేమపై అయోమయంగా మాట్లాడింది ఈ హీరోయిన్.

Tags:    
Advertisement

Similar News